![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 350 లో......విశ్వకి గంగ గురించి జయ నెగెటివ్ గా చెప్తుంది. నువ్వు తనని తప్పుగా అర్ధం చేసుకున్నావ్ .. నేను కూడా ముందు అలాగే అర్ధం చేసుకున్నాను కానీ ఆ తర్వాత తెలిసింది నేను తనని తప్పుగా అర్ధం చేసుకున్నానని విశ్వ చెప్తాడు. మరొక వైపు స్నేహ బయటకు వెళ్తుంటే ఇప్పుడు వద్దని గంగ ఆపుతుంది. ఈ టైమ్ కి వద్దు అసలు బయట బాలేదని గంగ చెప్తుంది.
స్నేహ నువ్వు వెళ్ళు అని శకుంతల చెప్తుంది. గంగ వద్దని అంటుంటే ఏంటి నా మాటకి నువ్వు ఎదురు తిరుగుతున్నావా అని శకుంతల కోప్పడుతుంది. దాంతో థాంక్స్ పెద్దమ్మ అని స్నేహ చెప్తుంది. ఎంజాయ్ ది పార్టీ అని ఇషిక చెప్తుంది. ఆ తర్వాత స్నేహ బయటకు వెళ్తుంది. తనతో ఒకతను ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుతాడు. ఇంత గొప్పింటి బిడ్డని పడెయ్యాలంటే కష్టమే అనుకుంటాడు.
మరొకవైపు జయతో వీరు మాట్లాడుతాడు. నువ్వేం కంగారుపడకు అంతా నేను చూసుకుంటానని చెప్తాడు. ఆ మాటలు రంగా విని రుద్రకి చెప్తాడు. ఇన్ని రోజులు ఆ జయ వెనకాల ఎవరో ఉన్నారు అనుకున్నాం కదా నాకెందుకో జయ వెనకాల వీరు ఉన్నట్టు అనిపిస్తుందని రంగా అంటాడు. దాంతో నాక్కూడా అలాగే అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి జయకి సపోర్ట్ చేస్తుంటే నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అనుకున్నా కానీ ఇలా చేస్తాడనుకోలేదని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |